"అరన్మై 4" విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్రర్ సిరీస్ మూవీ లలో అరమ్మై సిరీస్ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుండి మూడు మూవీ లు రూపొందాయి. ఆ మూడు మూవీ లు కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఆ సినిమాలను తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల చేయగా వాటికి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పరవాలేదు అనే స్థాయి విజయాలు దక్కాయి. ఇకపోతే ఈ సీరీస్ మూవీ లకి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుందర్ సి "అరాన్మై 4" మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుండి వచ్చిన మూడు మూవీబ్లు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ నాలుగవ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రాశి కన్నా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.

ఈ సినిమాని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు . ఇక పోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఓ అమ్మాయి ఇద్దరు చిన్న పిల్లల చేతులు పట్టు కొని నిలబడి ఉంది. ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: