మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన గురు మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడం ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఈ నటి ఎక్కువ శాతం తెలుగు కంటే కూడా తమిళ సింక్ పరిశ్రమపైనే ఇంట్రెస్ట్ పెట్టింది.
అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించింది. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన మలయాళ సినిమా కింగ్ ఆఫ్ కొత్త లో ఓ కీలకమైన పాత్రలో నటించి తన నటన తో మాత్రమే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అదరగొట్టింది. ఇకపోతే ఇప్పటికే ఈ బ్యూటీ తన నటనతో అంద చందాలతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని తెలుగు , తమిళ ఇండస్ట్రీ లలో అద్భుతమైన జోష్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కింది.
తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ మరికొన్ని రోజుల్లో టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రితికా సింగ్ కి ఓ కీలకమైన పాత్రలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తో పాటు అమితా బచ్చన్ , దగ్గుపాటి రానా కూడా కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.