నా తండ్రి మద్యానికి బానిసయ్యాడు.. షాకింగ్ విషయం చెప్పిన ఆలియా భట్?
రామ్ చరణ్ కు జోడిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు ఆలియా భట్ తలుపు తడుతున్నాయి అన్నది తెలుస్తుంది. అదే సమయంలో బాలీవుడ్లో ఎప్పటిలాగానే బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆలియా భట్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ను పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తన కుటుంబంలో జరిగిన ఒక ఆందోళనకరణ విషయం గురించి అభిమానులతో పంచుకుంది. ఒకానొక సమయంలో కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది అంటూ చెప్పుకొచ్చింది ఆలియా భట్.
అలియా భట్ తండ్రి మహేష్ భట్ బాలీవుడ్ లో స్టార్ నిర్మాతగా హవా నడిపించారు అన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే వారు. అయితే కొన్నాళ్లపాటు ఆయన నిర్మించిన సినిమాలు మొత్తం వరుసగా పరాజయాల పాలు అవడంతో ఆయన నష్టాల్లో మునిగిపోయారు. దీంతో మహేష్ భట్ డబ్బులు లేని పరిస్థితిని చూశారు అంటూ ఆలియా భట్ చెప్పుకొచ్చింది. పరిస్థితులు సాఫీగా మారడానికి ఎంతో సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చింది. కొంతకాలానికి తన తండ్రి మద్యానికి బానిసగా మారాడని.. కానీ ఆ తర్వాత వదిలేసాడని తెలిపింది. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇక్కడ వరకు రాగలిగాను అంటూ చెప్పుకొచ్చింది.