లూసిఫర్ సినిమా సీక్వెల్ కు సర్వం సిద్ధం..!!

Divya
మలయాళం సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన కథాంశాలతో పలు చిత్రాలు తెరకెక్కిస్తూనే ఉన్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా విభిన్నమైన సినిమాల కథలు కూడా మలయాళం లో తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటూనే ఉన్నాయి. మలయాళం స్టార్ హీరోగా పేరుపొందిన మోహన్లాల్ నాలుగు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో 350 కి పైగా సినిమాలలో నటించి తిరుగులేని హీరోగా పేరు సంపాదించారు. సీనియర్ నటుడుగా నటన నైపుణ్యం ఎదురులేని క్రేజ్ ను సైతం అందుకున్నారు మోహన్ లాల్.. నేటికీ అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలలో ఈయన కూడా ఒకరు.

ఆసక్తికరంగా లాల్ తో కలిసి డైరెక్టర్గా మారిన నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ 2019లో తెరకెక్కించిన లూసిఫర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సీక్వెల్ని సైతం చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. L2E ఎంపురాన్ మోహన్లాల్, పృథ్వీరాజ్ మరొకసారి ఒక సంచలనాలను సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఇద్దరిని మరొకసారి కలిపే ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇది అని చెప్పవచ్చు.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.లైకా ప్రొడక్షన్ ఆశిర్వాద్ సినిమాతో చేతులు కలిపి ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు.

L2E తో మలయాళ చిత్రాలలో తొలిసారి అవకాశంతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నామంటూ తెలియజేశారు. మా కలయికలో పరిశ్రమ వృద్ధికి వేగవంతం చేయడానికి కాకుండా పలు కథనాలను ప్రపంచ ప్రేక్షకులను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామంటూ తెలియజేశారు. ఈ చిత్రం విజయం కాకముందే అనేక సంవత్సరాల పాటు పరిశ్రమ నుండి ఎన్నో సినిమాలను  చేశామంటూ తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన సహకార ప్రాజెక్టుతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలియజేశారు. ఈ ఇద్దరు లెజెండ్లు కలిసి ఇప్పుడు తాజాగా లూసిఫర్ సినిమాలతో సంచలనాలకు తెరలేపడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మలయాళం ఇండస్ట్రీలోని వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: