ఆ ఇల్లు వలనే చిరంజీవికి అన్ని ఇబ్బందులా?
చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం కావచ్చు, నిహారిక వెంకట చైతన్య విడాకులు కావచ్చు, వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం వంటి విషయాలు మెగా ఫ్యామిలీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి ఫ్యామిలీ ఈ విధంగా తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కోవడానికి కారణం ఒక ఇల్లే కారణం అంటూ పెద్ద ఎత్తున ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది. మొగల్తూరులో చిరంజీవి ఇల్లు అంటూ గత కొంతకాలంగా వార్తల్లో ప్రచారం ఉంది ఈ ఇంటిని లైబ్రరీ కోసం ఇస్తానని చెప్పిన చిరంజీవి ఇప్పుడు దానిని 3 లక్షలకు అమ్మేశారు అంటూ ఒక వార్త గతంలో వైరల్ గా మారిన సంగతి విదితమే.
ఇక సదరు ఇల్లు తనది కాదని, చిరంజీవి గారి అమ్మమ్మ ఊరు ఆ ఇంటిలో తాను పుట్టానే తప్ప ఆ ఇంటిపై నాకు ఎలాంటి హక్కు లేదని చిరంజీవి పలు సందర్భాలలో చెప్పినప్పటికీ జనాలు ఆ మాటలను నమ్మే పరిస్థితి కనబడడంలేదు. ఇక అక్కడి లైబ్రరీ ఏర్పాటుకు తన సొంత డబ్బును ఉపయోగించి ఒక బిల్డింగ్ కూడా కట్టించానని ఓ సందర్బంలో ఆయన చెప్పారు. అయినప్పటికీ కొందరు మాత్రం లైబ్రరీ కోసం ఇస్తానన్న ఇంటిని చిరంజీవి అమ్ముకున్న కారణంగానే ఇలా ఇబ్బందులు పడతారని ఆ ఇల్లు చిరంజీవి ఫ్యామిలీకి బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది అంటూ ఓ వార్తని వైరల్ చేస్తున్నారు.