సూపర్ హిట్ సినిమాని వదిలేసి.. ప్లాప్ సినిమా ఎంచుకున్న విజయ్ దేవరకొండ?
ఆ తరువాత వీరిద్దరు సైలెంట్ అయ్యారు. ఐతే జనాలకి తెలియని మరో విషయం యేమిటంటే, వీరిద్దరి కలయికలో లైగర్ కంటే ముందే ఓ సినిమా రావలసి వుంది. దానిపేరే ఇస్మార్ట్ శంకర్. అయితే ఈ స్టోరీ విజయ్ దేవరకొండ తో చేద్దాం అని అనుకున్నా పూరికి అవకాశం ఇవ్వలేదు మన విజయ్. దాంతో అదే స్టోరీ ని ఎనర్జిటిక్ హీరో అయిన రామ్ పోతినేని ని పెట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి పురి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాతే పూరి సెకండ్ ఇన్నింగ్స్ మరలా తెలుగు చిత్ర పరిశ్రమలో నిరాటంకంగా కొనసాగుతోంది. అయితే లైగర్ తరువాత దర్శకుడు కాస్త నెమ్మదించారు. మళ్లీ పూరి జగన్నాధ్ కి ఒక మంచి హిట్ కావాలి కాబట్టి ఇప్పుడు మళ్లీ రామ్ తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే చేయాల్సిన ఇస్మార్ట్ శంకర్ సినిమా వదిలేసి ఇలా లైగర్ అనే ప్లాప్ సినిమా చేసాడు అంటూ అప్పట్లో విజయ్ ని చాలా మంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం జరిగింది.