బిగ్ బాస్ లో నాగార్జున రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఎపిసోడ్ కి ఎంతంటే?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్.. ఇక ప్రేక్షకులు అందరిని అలరిస్తూ ఇప్పటికే 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే మధ్యలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. అటు ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న బిగ్బాస్ నిర్వాహకులు ప్రేక్షకులు అందరిని అలరిస్తూ ఉన్నారు. అయితే బిగ్బాస్ ఏడవ సీజన్ కూడా భారీ అంచనాలతో ప్రారంభమైంది. ఏకంగా ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సీజన్.  ఇక ఉల్టా పుల్టా అని నాగార్జున చెప్పినట్లుగానే బిగ్బాస్ మొదటి ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలా తెలుగు బుల్లితరపై బిగ్ బాస్ ప్రారంభమైంది అంటే చాలు ఎక్కడ చూసినా ఈ షో గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అందరూ ఇక ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది షో కి పోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పారితోషకం ఎంత అని చర్చించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే నాగార్జున పారితోషకం గురించి ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు తెరమీదికి వస్తూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు నాగార్జున పారితోషకం లీక్ అయిందంటూ మరో వార్త వైరల్ గా మారిపోయింది. బిగ్బాస్ 7 తెలుగు సీజన్ కోసం ఒక్కో ఎపిసోడ్కి కోటి రూపాయల పారితోషకం తీసుకుంటున్నాడట నాగార్జున. ఇక మూడు నెలల పాటు సాగే ఈ కార్యక్రమం కోసం దాదాపు 20 కోట్ల పైగానే పారితోషకం అందుతుందట. అయితే బిగ్ బాస్ మూడో సీజన్ కి ఎనిమిది కోట్లు.. నాలుగో సీజన్ కి 10 కోట్లు.. ఐదో సీజన్ కి 12 కోట్లు.. ఆరవ సీజన్ కి 16 కోట్లు తీసుకున్నాడట నాగార్జున. అన్నిటికీ మించి బిగ్బాస్ ఏడవ సీజన్ కి 20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: