సలార్: ఆ రిలీజ్ డేట్ ప్రభాస్ కి చాలా రిస్క్?

Purushottham Vinay
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ ఈ ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అదే రోజున షారుఖ్ ఖాన్ దున్కి థియేటర్లలో రిలీజ్ కానుంది. వరుస విజయాలతో జోరుమీదున్న షారుఖ్ ఖాన్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పైగా ఈ సినిమాని రాజ్ కుమార్ హిరాని లాంటి టాప్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇంకా అలాగే ఈ సినిమాకి పోటీగా హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2 రిలీజ్ అవుతుంది. అందువల్ల ఓవర్ సీస్ లో సలార్ కి చాలా నష్టం జరుగుతుంది. షారుఖ్ ఖాన్ కి ఎలాగో నార్త్ అమెరికాలో క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ ఆయన సినిమాకి భారీ వసూళ్లు వస్తాయి. పైగా పఠాన్, జవాన్ లాంటి రెండు భారీ హిట్లని కూడా అందుకున్నాడు.


ఇక సలార్ సినిమా అదే తేదీకి ఫిక్స్ అయితే తెలుగులో ఇప్పటికే క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావాల్సిన సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకునే ఛాన్స్  ఉంది. షారుఖ్ ఖాన్ , ప్రభాస్ సినిమాలు పోటీ పడితే ఇండియన్ సినిమా కింగ్ ఎవరో తేలిపోనుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఏది ఏమైన ప్లాపుల్లో వున్న ప్రభాస్ ఆ డేట్ ని ఫిక్స్ చేసుకోవడం రిస్క్ అనే చెప్పాలి.అయితే గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు పోటీగా విడుదలైన స్టార్ హీరోల సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకునే విషయంలో ఫెయిలయ్యాయి. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా రిలీజ్ డేట్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సలార్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక క్లారిటీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నెల 28వ తేదీన సలార్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. సలార్1 ఈ సంవత్సరం రిలీజ్ కానుండగా సలార్2 కు సంబంధించి స్పష్టత కావాలని ఫ్యాన్స్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: