ఎట్టకేలకు అయ్యగారీ ఏజెంట్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!

Divya
టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చిన వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ కూడా ఒకరు. అఖిల్ ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కేవలం తన కెరియర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మరో సినిమా కూడా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో విడుదలై అట్టర్ ప్లాప్ చిత్రంగా నిలిచిన చిత్రం ఏజెంట్.. ఈ సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కావడం జరిగింది.
భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది.దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా నిర్మాత ఈ సినిమా ఫ్లాప్ అయిందని విషయాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. స్క్రిప్టు లేకుండా షూట్ కి వెళ్లడం మాదే తప్పు అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంత పెద్ద హిట్ సినిమా అయినా సరే థియేటర్లో విడుదలైన 50 రోజులలోపు ఓటీటి లోకి వచ్చేస్తూ ఉంటుంది.

కానీ ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవడంతో అది కూడా నెల రోజులలోపే ఓటీటి లో ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటి ఊసే లేదు.. ఈ సినిమా విడుదలకు ముందే సోనీ లీవ్ ఓటిటి సంస్థ ఏజెంట్ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసింది. కానీ డిజాస్టర్ అవడంతో అందులో కూడా రిలీజ్ చేయలేదు. దీంతో అఖిల అభిమానులు కూడా నిరాశ చెందారు అయితే ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 29న 4 బాసరలో సోనీ లైవ్లో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటి లో సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: