జవాన్ చిత్రానికి సిరి హనుమంతు అందుకున్న రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

praveen
తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాదుషా షా రుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నాయన తార జంటగా నటించిన చిత్రం జవాన్. సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని, ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రం లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా, సానియా మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం లో తెలుగు యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు కూడా నటించడం ఎవ్వరు ఊహించని విషయం.

ఈ పాన్ ఇండియా చిత్రం లో ఒక్క తెలుగు నటుడు గాని, నటి గాని లేరే అన్న లోటుని సిరి తీర్చేసింది. ఈ చిత్రంలో సిరి, హీరో షా రుఖ్ ఖాన్ పక్కనే ఉంటుంది. ఆమెకు ఎటువంటి డైలాగ్స్ లేవు ఈ చిత్రంలో. షా రుఖ్ పోషించిన జైలర్ ఆజాద్ పాత్రకు సుబోర్డినేట్ గా నటించింది సిరి. ఐతే ఈ చిత్రంలో సిరిని ఎవ్వరు గమనించి ఉండరు. కానీ గమనించిన వారు మాత్రం ఖచ్చితంగా సర్ప్రైస్ అయ్యి ఉంటారు. షా రుఖ్ లాంటి సువర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా మంది నటుల జీవిత ఆశయం. అలాంటిది సిరి కి ఈ అవకాశం ఎలా దక్కిందో అర్ధం కాక, ఆమె చాలా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమాలో ఆమె కనిపించే సీన్ ని ఫోటో తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు ఆమె అభిమానులు. ఐతే సిరి ఈ చిత్రానికి సిరి అందుకున్న పారితోషకం కూడా భారీగానే ఉన్నట్టు సమాచారం. ఆమెకు ఈ సినిమాలో ఎటువంటి డైలాగ్స్ లేకపోయినప్పటికీ, ఆమె ఏకంగా 20 లక్షల రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకుందని సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: