ఆ పంచ్ వేసి.. రష్మీ పరువు తీసేసిన బుల్లెట్ భాస్కర్?
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం సినిమాలో సుడిగాలి సుదీర్ నటించిన పాత్ర మెరుపుతీగల ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అంటూ తెగ పంచులు వేసింది జబర్దస్త్ జడ్జి రోజా. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి జోక్ అటు యాంకర్ రష్మీ పై వేశాడు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోలా శంకర్ సినిమాలో యాంకర్ రష్మీ పాత్ర గురించి బుల్లెట్ భాస్కర్ పంచ్ వేశాడు.
అయితే బోళా శంకర్ సినిమాను మొత్తం జబర్దస్త్ ఆర్టిస్టులతో ఫుల్లుగా నింపేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక జబర్దస్త్ యాంకర్ కం యాక్టర్ రష్మి గౌతమ్ కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఒక సీన్లో కనిపిస్తూ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేస్తుంది యాంకర్ రష్మీ. అయితే ఇదే విషయం గురించి బులెట్ భాస్కర్ మాట్లాడుతూ రశ్మిని చూడడానికి నేను బోలా శంకర్ సినిమాకు వెళ్లాను. సన్నివేశం వచ్చేటప్పుడు కర్చీఫ్ కింద పడిపోతే అది తీసుకోవడానికి ఇలా తల దించి పైకి చూసేసరికి రష్మీ వెళ్ళిపోయింది అంటూ పంచ్ వేస్తాడు బుల్లెట్ భాస్కర్.