ఒక్కసారిగా డౌన్ అయిన జవాన్ కలెక్షన్స్..!!

Divya
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం మొదటి ఐదు రోజులలోనే బాక్సాఫీసు వద్ద 500 కోట్లకు పైగా గ్రాస్వసులో సాధించినట్లు తెలుస్తోంది మొదటి రోజు ఏకంగా 129 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన జవాన్ సినిమా రోజుకు 100 కోట్లు చొప్పున వేసుకుంటే 5 రోజుల్లో 500 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్నది. దీంతో ఈ సినిమా తొందరగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి అడుగుపెడుతుందని భావించగా కానీ ఇప్పుడు ఆ కలెక్షన్స్ వచ్చేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ సినిమా 1000 కోట్ల మార్కు అందుకోవడం కష్టమే అంటూ పలువురు నీటిజన్ సైతం తెలియజేస్తున్నారు.
జవాన్ సినిమా ఇండియాలో 25 శాతం మంది మంది మాత్రమే చూసినట్లు తెలుస్తోంది.. వారంలో 25- 30%  మాత్రమే కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తమిళనాడు మినహా హిందీ వర్షన్ చిత్రాలు హైదరాబాద్ మరియు బెంగళూరులో మంచి కలెక్షన్స్ సాధిస్తున్నట్లు తెలుస్తోంది .దక్షిణాదిలో ఉన్న చాలామంది ప్రేక్షకులు సైతం ఇతర భాషలలోను మరియు హిందీ సినిమాలను సైతం అర్థం చేసుకుంటారు. అయితే సోమవారం రోజు నుంచి ఒక్కసారిగా జవాన్ సినిమా కలెక్షన్స్ డౌన్ అయినట్లుగా తెలుస్తోంది.
సోమవారం రోజున 52 కోట్లు మంగళవారం రోజున 38 కోట్లు కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఈ వీకెండ్ బాలీవుడ్లో మరో పెద్ద సినిమా రిలీజ్ కానప్పటికీ సౌత్లో విశాల్ నటించిన మార్పు ఆంటోని సినిమా విడుదల కాబోతోంది. మరి జవాన్ సినిమా ఈ వీకెండ్ లో ఏమన్నా కలెక్షన్స్ రేంజ్ పెంచుకుంటుందా లేదా అనే విషయం చూడాలి.. పఠాన్ సినిమాకి కూడా ఇలాగే మొదలైంది.. మొదట 100 కోట్లు తెచ్చి పెట్టిన ఈ సినిమా ఆ తర్వాత కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. దీంతో టికెట్లు రేటు తగ్గించిన పలు ఆఫర్లు పెట్టి రూ .1000 కోట్ల క్లబ్ లోకి తీసుకు వెళ్లడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: