బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్...!!
ఇక తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో హిట్ అందుకున్న లవ్ టుడే సినిమాను బాలీవుడ్ లో జునైద్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత జునైద్ మరో కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జునైద్ సరసన సాయిపల్లవి అయితే బావుంటుందని మేకర్స్ భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు సాయిపల్లవి ఓకే చెప్పిందా.. ? లేదా.? అనేది తెలియాల్సి ఉంది. ఇక అభిమానులు అయితే.. బాలీవుడ్ కు సాయిపల్లవి నో నే చెప్తుంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.