నాగార్జున కంటే ముందు.. అమల ఆ హీరోను ప్రేమించిందా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం సహజం. అయితే ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా అన్నది మాత్రం డౌటే. ఎందుకంటే ఇక ఎంతోమంది ప్రేమించుకోవడం.. ఆ తర్వాత కొన్నాల్లకే బ్రేకప్ చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇక ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.  అయితే ఇలా పెళ్లి చేసుకున్న వారు కూడా కొన్నాళ్ళకి విడాకులు తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చేసుకుని మోస్ట్ క్యూట్ కపుల్ గా కొనసాగుతుంది ఎవరు అంటే అక్కినేని నాగార్జున, అమల అని చెబుతూ ఉంటారు.


 సినిమా సమయంలో వీరి మధ్య పుట్టిన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే పెళ్లి తర్వాత హీరోయిన్ పోస్ట్ కు రిజైన్ చేసేసింది అమల  ఇక ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఆదర్శ ఇల్లాలుగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు హీరోయిన్గా చేయట్లేదు కానీ కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలో కనిపిస్తూ ఇక ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే నాగార్జునకు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్లు  ఉన్నాయి అంటూ వార్తలు వచ్చిన అవేవి పట్టించుకోకుండా అమల తన వైవాహిక బంధం ఎంతో బలంగానే ఉంచుకుంటుంది. అమల నాగార్జున ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ పుట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అమలకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారిపోయింది. అమల నాగార్జున కంటే ముందు మరో హీరోని ప్రేమించిందట.


 కానీ ఆ హీరోతో ప్రేమ ఇక పెళ్లి వరకు వెళ్లలేదట  అమలా నాగార్జునతో పాటు చిరంజీవి కమలహాసన్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాల్లో జాతకట్టింది. ఇక అయితే ప్రభువు కార్తిక్ హీరోగా అమల హీరోయిన్గా వచ్చిన ఘర్షణ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది  ఆ టైంలో హీరో ప్రభు కార్తీక్ తో అమల ప్రేమలో పడిందట. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ కొన్ని అన్నివార్య కారణాలవల్ల బ్రేకప్ జరిగిందట. ప్రభు కార్తీక్ ఇంట్లో అమలతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇక వీరి ప్రేమ కాస్త బ్రేకప్ వరకు వచ్చిందని కోలీవుడ్ మీడియాలో అప్పట్లో వార్తలు వినిపించాయ్. ఆ తర్వాత నాగార్జునతో పరిచయం ప్రేమ పెళ్లి పిల్లలు ఇలా అన్నీ జరిగిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: