చంద్రబాబు అరెస్ట్ నిర్మాతలు భయం భయం..!!
చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయ అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు.. దత్తపుత్రుడు దత్తతండ్రి అంటూ పలువురు నాయకులు సైతం వీరిద్దరు పైన ఎన్నో విమర్శలు చేస్తూనే ఉంటారు.. అంతేకాకుండా బీజేపీతో ఉంటూనే చంద్రబాబుతో నిత్యం టచ్ లోనే ఉంటాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్టు అయితే కచ్చితంగా ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్రంగా చూపిస్తుందని.. పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తారని ప్లాన్ తోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది చూస్తుంటే మరొకసారి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండడం గ్యారెంటీ అనేలా కనిపిస్తోంది.
అంతేకాకుండా చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కడం కూడా జరిగింది. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ నిర్మాతలు సైతం ఒక్కసారిగా భయపెట్టడం జరుగుతోంది .తమ హీరో రోడ్డు ఎక్కితే తాము కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని విషయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. వారాహి యాత్రలో ఒక దశ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరొకసారి సినిమాలకు కాల్ సీట్లు కేటాయించి పలు సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. అయితే కొత్త సినిమా షెడ్యూల్ ప్రారంభమైన 24 గంటలలోనే ఇలాంటి షాక్ తగలడంతో.. పవన్ కళ్యాణ్ షూటింగ్ కు వస్తారా రారా అని విషయం నిర్మాతలను టెన్షన్లో పడేస్తోంది.