కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ కు.. ఛాన్స్ ఇచ్చిన నాచురల్ స్టార్?

praveen
డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారిన నాని ఇక తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నాచురల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను ఎంచుకుంటూ ఎప్పుడు ప్రేక్షకులకు ఎంటర్టైర్మెంట్ పంచుతున్నాడు ఈ హీరో. అయితే మొన్నటికి మొన్న దసరా అనే సినిమాతో మాస్ అవతారం ఎత్తి  బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు అనే విషయం తెలిసిందే. ఎప్పుడు క్యూట్గా కనిపించే నానీ ఏకంగా పక్క మాస్ అవతారంతో అభిమానులందరికీ కూడా పూనకాలు తెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు కొత్త దర్శకుడు శౌర్యావ్ తో హాయ్ నాన్న అనే ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాను చేస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాపై కూడా ప్రస్తుతం ప్రేక్షకులలో అంచనాల పెరిగిపోయాయి అని చెప్పాలి.


 అయితే ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న నాని ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడట. సిబి చక్రవర్తి డైరెక్షన్లో ఒక ఎంటర్టైనర్ సినిమా చేసినందుకు నాచురల్ స్టార్ రెడీ అవుతున్నాడట.  శివకార్తికేయన్ తో ఈ దర్శకుడు తీసిన డాన్ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. డబ్బింగ్ సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే దర్శకుడు టేకింగ్ కి ఫిదా అయినా నాని ఇక ఇప్పుడు అదే దర్శకుడుకి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.


 ఇక దసరాకి ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి.. అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు అని చెప్పాలి. బోయపాటి- రామ్ స్కంద మూవీ కూడా ఇదే బానర్లు నిర్మించబడుతుంది అన్న విషయం తెలిసిందే  అయితే డాన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించి కడుపుబ్బ  నవ్వించిన డైరెక్టర్ సి బి చక్రవర్తి ఇక ఇప్పుడు నానితో ఎలాంటి.. సినిమా తీయబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: