త్రిషతో లిప్ లాక్ అంటే.. ఆ హీరో నో చెప్పాడట తెలుసా?
అయితే హీరోయిన్లు కూడా పాత్రకు అవసరం కాబట్టి.. తప్పదు అన్నట్లుగా ఇక అలాంటి సన్నివేశాలలో నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ ఉంది అంటే చాలు ఏ హీరో అయినా సరే చేయను అని చెప్పడు. అందరూ కూడా ఇలాంటి సీన్స్ కి ఓకే అంటారు. కానీ ఒక్క హీరో మాత్రం ఏకంగా స్టార్ హీరోయిన్ తో లిప్ లాక్ చేసే సన్నివేశంలో నటించమంటే మాత్రం అస్సలు చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసాడట. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో వచ్చిన 96 మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన త్రిష ముద్దు సీన్లలో నటించింది చాలా తక్కువే. కానీ 96 సినిమాలో పాత్రకి అవసరం కావడంతో ముద్దు సీన్ కు ఓకే చెప్పిందట. కానీ ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి మాత్రం లిప్ లాక్ సీన్ కు నో చెప్పాడట. ముందుగా స్క్రిప్ట్ లో దర్శకుడు లిప్ లాక్ సీన్ రాసుకున్నాడు. ఈ సినిమా చివర్లో ఒకరిని ఒకరు విడిపోవలసి రావడం జరుగుతుంది. ఇక ఆ సమయంలో విజయ్ సేతుపతిని విడవలేక త్రిష అతని హగ్ చేసుకుంటుంది. అయితే ముద్దు మాత్రం పెట్టుకోలేదు. కానీ హీరో తలని మాత్రమే పెట్టుకుంటుంది. హీరో కూడా ఆమెను పట్టుకుని ఫీల్ అవుతాడు. అయితే ఆ సమయంలో త్రిషకి లిప్ లాక్ ఇచ్చేందుకు నిరాకరించాడట హీరో. దీంతో దర్శకుడు కూడా ఇందుకు అంగీకరించి ముద్దు సీన్ లేకుండానే ఇక క్లైమాక్స్ చిత్రీకరించారట.