చంద్రబాబు నాయుడు అరెస్టుపై బాలయ్య ఫైర్..!!
జగన్ సీఎం అయ్యాక అన్నం తినడం మానేసి కేవలం కోర్టుల చేత చివాట్లు తింటున్నారు అంటూ కూడా ఎద్దేవ చేయడం జరుగుతోంది. అయితే ఇదంతా కేవలం కక్ష సాధింపులకు పాల్పడే చేశారు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు బాలకృష్ణ.. కేవలం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాలన్నదే తమ జీవిత లక్ష్యం అన్నట్లుగా అధికార పార్టీ భావిస్తోందంటూ కూడా తెలియజేస్తున్నారు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడుని ఏ చట్టం కింద అరెస్టు చేస్తారు అంటూ ఒక ప్రకటనలు బాలయ్య అడగడం జరిగింది.
స్కిల్ డెవలప్మెంట్ పెద్ద కుంభకోణం అని కూడా ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఇది కావాలని రాజకీయ కక్షతో చేస్తున్నట్లు కుట్ర అంటూ తెలుపుతున్నాడు బాలయ్య..19.12.2021 లో FIR నమోదయింది నిజంగా అవినీతి చేసి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జి సీటు చేయలేదు.. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసి నిధులు స్తంభింప చేయొచ్చు కదా అంటూ బాలయ్య మాట్లాడడం జరిగింది.. అందులో 72,000 ఉద్యోగాలు ఇచ్చామని దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారు అంటూ బాలయ్య తెలుపుతున్నారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటూ కూడా తెలిపారు బాలయ్య.