తెలుగు రాష్ట్రాల్లో "జవాన్" మూవీకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే షారుక్ చాలా సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక చాలా సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న షారుక్ ఈ సంవత్సరం విడుదల అయిన పటాన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. పఠాన్ మూవీ తో ఏకంగా షారుక్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్ లను సాంతం చేసుకున్నాడు.


ఇక పటాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుక్ తాజాగా జవాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించగా ... ప్రియమణి , యోగి బాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రాల్లో కనిపించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది.


అలాగే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి విడుదల అయిన మొదటి రోజు 9.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఏ ఇతర హిందీ సినిమా కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు ఈ రేంజ్  గ్రాస్ కలెక్షన్ లను సాధించనట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: