గేట్లు తెలపండి నేను వెళ్ళిపోతా.. బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన శివాజీ?
అయితే మొదటి రోజు నుంచి శివాజీ అందరితోను సరదాగా హుందాగా ఉంటూ పెద్దరికం ప్రదర్శిస్తున్నాడు. తనకంటే చిన్నవారిని ప్రేమగా పిలుస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. అయితే నాలుగవ రోజు మాత్రం శివాజీ కోపంతో ఊగిపోయాడు. ఇలా అతనికి కోపం రావడానికి కారణం కూడా లేకపోలేదు. శివాజీకి కాఫీ ఇవ్వకపోవడంతో హర్ట్ అయ్యాడు. నా ఈగోను దెబ్బ కొట్టాడు అంటూ శివాజీ రచ్చ చేశాడు. రతిక పల్లవి ప్రశాంత్ ఎంత బుజ్జగించిన తనలోని వేడిని తగ్గించుకోలేకపోయాడు. ఒక ఆర్టిస్టును ఇంటి లోపలికి తెచ్చి చిన్నచూపు చూస్తారా.. నేను జనం కోసం పని చేస్తాను. చాలాపెద్దవాళ్ళను చూసా వాళ్ళ దగ్గర నుండి ఇక్కడికి వచ్చా.. నాకు కాఫీ ఇవ్వకుండా అవమానిస్తారా అంటూ గట్టిగా అరిచాడు.
అయితే రతిక ఉజ్జగిస్తుంటే నాకు కాఫీ ఇవ్వమను నా ఈగో చల్లారుతుంది అంటూ కామెంట్ చేశాడు. కాఫీ కంటే ముందు బ్రేక్ ఫాస్ట్ తిని బీపీ టాబ్లెట్లు వేసుకో అంటే.. నేను బ్రేక్ ఫాస్ట్ తినను ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటూ శివాజీ బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రితికకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఏకంగా స్టెతస్కోప్ తో అందరి గుండెల్లో పరీక్షించి ఏముందో చెప్పాలని అన్నాడు. అయితే ఇక బిగ్ బాస్ ఇచ్చిన బీపీ స్టేతస్కోప్ మెషిన్లను విసిరి కొట్టే ప్రయత్నం చేశాడు శివాజీ. అయితే అతని తీరుతో అందరూ షాక్ అయ్యారు. మరి వీకెండ్ లో నాగార్జున వచ్చి శివాజీ తీరుపై ఎలాంటి వార్నింగ్ ఇస్తాడో చూడాలి మరి.