తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నర్వనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సమంత నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. వశిం అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు పర్వాలేదు అనే రేంజ్ లో టాక్ రావడంతో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.
ముఖ్యంగా ఈ మూవీ కి "యు ఎస్ ఎ" లో సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమా కి ఇప్పటికే "యూ ఎస్ ఏ" లో 1.4 ప్లస్ మిలియన్ కలెక్షన్ లు దక్కాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లోభారీ ఎత్తున విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి లాంగ్ రాన్ లో భారీ కలెక్షన్ లు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ మరియు సమంత మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో వీరిద్దరూ మహానటి సినిమాలో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.