రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగానే ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేసింది.
దానికి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక పోతే ఈ మూవీ విడుదలకు అంతా సిద్ధం అనుకున్న సమయం లోనే తాజాగా ఈ మూవీ యొక్క గ్రాఫిక్స్ అనుకున్నంత రేంజ్ లో రాలేదు అని దానితో ఈ సినిమా దర్శకుడు తీవ్ర అసంతృప్తి చెంది ఈ సినిమా గ్రాఫిక్స్ ను మరింత మెరుగు పరిచి ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంతో సెప్టెంబర్ 28 వ తేదీన ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేసినట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ గ్రాఫిక్స్ పనులను శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్ హీరో గా రూపొందిన రోబో 2.0 సినిమా గ్రాఫిక్స్ పనులు చేసిన సంస్థకు అప్పజప్పారట.
ఇకపోతే ఈ సంస్థ వారు సలార్ గ్రాఫిక్స్ పనులను అనుకున్నంత రేంజ్ లో చేయకపోవడంతో సలార్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ అసంతృప్తి చెంది ఈ సినిమా గ్రాఫిక్స్ పనులను ప్రస్తుతం వేరే సంస్థకు అప్పచెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.