మా బావ చావుకి కారణం అదే.. డిస్కోశాంతి కామెంట్స్ వైరల్..!!
ఈ సందర్భంగా డిస్కో శాంతి మాట్లాడుతూ మా బావ గుండెపోటు వచ్చి చనిపోలేదు.. ఇంజక్షన్ వేయడం వల్ల మరణించారు అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.. షూటింగ్ కోసం ముంబైకి వెళ్ళినప్పుడు ఆయన ముందు రోజు సాయంత్రం ఫోన్ చేస్తే పిల్లలతో మాట్లాడి రేపు సాయంత్రానికి వస్తానని తెలిపారట. ఉన్న ఫలంగా గుండెపోటు రావడంతో ముంబైలోని ఒక హాస్పిటల్లో చేర్పించారు.. అయితే అక్కడ డాక్టర్లు తనకు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారని ఆ కారణంగానే తను చనిపోయాడని శ్రీహరి భార్య డిస్కో శాంతి సైతం తెలియజేసింది.
తన బావని హాస్పిటల్ లో చేర్చిన తర్వాతే తను వెళ్లానని కానీ అక్కడ తనని లోపలకు రానివ్వలేదని వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడుతున్నారు.. నాకు హిందీ రాదు అలాగే.. బావ ఎవరు అనే విషయం పైన వారికి తెలియదు.. సిస్టర్ బయటికి పంపించి తనకు పెట్టిన సెలైన్ బాటిల్ లో ఒక ఇంజక్షన్ వేశారు..ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత శ్రీహరి చెవుల్లో నుంచి ముక్కులో నుంచి రక్తం రావడం మొదలయ్యిందట.. ఆ కొద్దిసేపటికి తను మరణించారని తెలిపింది డిస్కో శాంతి.. అయితే కచ్చితంగా తనకు వేయకూడని ఇంజక్షన్ వేశారని ఆ రాంగ్ ట్రీట్మెంట్ కారణంగానే తన బావ మరణించారని తెలుపుతోంది డిస్కో శాంతి.. ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.