ఖుషి మూవీ 2 డేస్ కలెక్షన్స్ అదుర్స్..!!
అయితే ఖుషి సినిమాకి మాత్రం కేవలం రెండు రోజుల వ్యవధిలోని మిలియన్ డాలర్లలోను రాబట్టింది. ఈ సినిమాతో సమంత మరో అరుదైన రికార్డును సైతం క్రియేట్ చేసుకున్నది.. సౌత్ ఇండియాలోనే ఏ హీరోయిన్ కు కూడా ఇలాంటి రికార్డు ఇప్పటివరకు రాలేదు సమంత నటించిన 17 చిత్రాలు మిలియన్ క్లబ్లో చేరాయి అలా సమంత ఖాతాలో ఇప్పుడు అరుదైన రికార్డు దక్కించుకుంది ఖుషి చిత్రం. స్టార్ హీరోలైన మహేష్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ చిరంజీవి రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలు రెండు మూడు కంటే ఎక్కువ లేవట..
ఖుషి సినిమా మొదటి రోజు రూ.30 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా తెలుస్తోంది..రెండవ రోజు కూడా భారీ స్థాయిలోనే రెస్పాన్స్ లభించినట్లు సమాచారం.. ఫలితంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .6 కోట్ల రూపాయల వరకు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక యూఎస్ఏ లో ఒక మిలియన్ డాలర్ల మార్కును అందుకున్నది. ప్రపంచవ్యాప్తంగా రూ.39.5 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను సాధించినట్లు సమాచారం. దాదాపుగా 52 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్ జరగక ఇప్పటివరకు కేవలం రూ.39.5కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ను సాధించింది.. మరి ఏ మేరకు కలెక్షన్లు రాపడుతుందో చూడాలి మరి.