టాలీవుడ్
యువ హీరోల్లో ఒకరైన హీరో
సుధీర్ బాబు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథ లను ఎంచుకుంటూ .. విజయాల కోసం కష్టపడుతున్నాడు. మహేష్ బావ గా పేరు ఉన్నా కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడాని కి మొదటి నుంచి ఆరాట పడుతున్నాడు. ప్రస్తుతం
సుధీర్ బాబు చేతి లో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ఫిట్ నెస్ గురించి మాట్లాడుకోవాలంటే..
టాలీవుడ్ లో
సుధీర్ మొదటి వరుస లో ఉంటాడు. ఆ బాడీ ని ఎలా కావాలంటే అలా మలచడం లో సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. తాజా గా
సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూ లో పవన్
కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ
సుధీర్ హీరో గా కాకుండా ఇప్పుడు
డైరెక్టర్ అయితే .. అందు లో
హీరో ఎవరు.. ? ఎలాంటి కథను.. మీరు ఎంచుకుంటారు.. ? అన్న ప్రశ్నకు..
సుధీర్ తడుముకోకుండా పవన్
కళ్యాణ్ పేరు చెప్పడం విశేషం.
” నేను
డైరెక్టర్ అయితే .. పవన్ తో
సినిమా చేస్తా .. అందులో పవన్ ను సీఎం చేస్తా.. నా
సినిమా లో పవన్ ను సీఎం గా చూడాలను కుంటున్నాను” అనో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
డైరెక్టర్ గా మారితే.. మహేష్ తో
సినిమా చేస్తా అనకుండా పవన్ పేరు చెప్పడం పవన్ ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేస్తోంది. ఇది నిజం అవుతుందా..? లేదా.. ? అని పక్కన పెడితే.. పవన్ ను సీఎం అనడం తో ఫ్యాన్స్.. వచ్చే ఏడాది నిజం గానే సీఎం అవుతాడు.. అప్పుడు
సినిమా తీయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.