ఓరినాయనో.. బన్నీ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే?
ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయిన అల్లు అర్జున్.. పారితోషకం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అప్పటివరకు టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ పుష్పా సినిమాతో ఐకానిక్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ సంపాదించాడు. ఇక 68 ఏళ్ల తర్వాత ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. ఇంతటి సక్సెస్ వచ్చిందంటే పారితోషకం కూడా ఏ రేంజ్ లో పెంచేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో అటు అల్లు అర్జున్ కూడా ఉన్నాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తో ప్రతి ఒక్కరిలో కూడా అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి. అయితే పుష్ప 2 హిందీలో రిలీజ్ చేసే రైట్స్ ని బన్ని సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. ఏకంగా 125 కోట్లు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నాడట. పుష్ప 2 పారితోషకం డబ్బులుగా తీసుకోకుండా హిందీ రైట్స్ తీసుకున్నాడట బన్నీ. ఈ లెక్కన చూస్తే పుష్ప 2 కోసం ఏకంగా 125 కోట్లు పారితోషికం అందుకున్నాడు అని చెప్పాలి. ప్రభాస్ ఇప్పటికే వంద కోట్లు అందుకుటుండగా.. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రికార్డును బ్రేక్ చేశాడని అందరూ చర్చించుకుంటున్నారు.