ఏంటి హీరోయిన్ శ్రీలీలకు.. హీరో యష్ బావ అవుతాడా?

praveen
అప్పుడు వరకు సాదాసీదా హీరోగా ఉన్న కోలీవుడ్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ మూవీ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ సాధించింది. అయితే ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక చివరికి సినిమాకు సీక్వెల్ కూడా చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారూ. ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. దీంతో అంచనాల పెరిగిపోయాయ్. ఇక అంచనాలకు తగ్గట్లుగానే కేజిఎఫ్ కు సీక్వల్ గా వచ్చిన పార్ట్ 2 కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

 దీంతో ఇక యష్ కు భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులందరూ కూడా అభిమానులుగా మారిపోయారు అని చెప్పాలి. అయితే కేజిఎఫ్ 2 తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా గురించి అనౌన్స్ చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో యష్ కి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ రిలీజ్ లకు మధ్య బావ మరదలు సంబంధం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇక ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.

 వరుసగా చాన్సులు దక్కించుకుంటూ దుమ్ము లేపుతుంది. అయితే యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరో యష్ ను బావ అని పిలుస్తుందట. అదేంటి వారి మధ్య ఏదైనా బంధుత్వం ఉందా ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి వారి మధ్య ఇలాంటి బంధుత్వం లేదు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. శ్రీ లీల మదర్ స్వర్ణలత బెంగళూరులో మంచి డాక్టర్ అన్న పేరు ఉంది. అయితే యష్ వైఫ్ రాధిక ఆమె వద్దకు వెళుతూ ఉండేవారట. దీంతో వారి ఫ్యామిలీతో శ్రీలీలా కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక రాధికను హీరోయిన్ అవకముందు నుంచి శ్రీలీల అక్క అని పిలిచే వారిట. అదే వరుసలో రాధిక భర్త ఆయన యష్ ను జీజు అంటే బావ అని పిలిచేది. ప్రజెంట్ బయట ఇలా పిలవక పోయిన కుటుంబ ఫంక్షన్ లో కలిసినప్పుడు మాత్రం ఇలాగే పిలుస్తూ ఉంటుందట శ్రీలీల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: