ఆనాటి అవమానాన్ని గుర్తుకు చేసుకున్న అల్లు అర్జున్ !
తాను ఇండస్ట్రికి సంబంధించిన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకు కూడ అవమానాలు తప్పలేదని అంటూ ‘గంగోత్రి’ సినిమాకు ముందు తర్వాత తాను ఎదుర్కొన్న నెగెటివ్ కామెంట్స్ గురించి అవమానాల గురించి వివరించాడు. తన అరంగేట్రం అంత సాఫీగా ఏమీ జరగలేదు అంటూ తన చదువు పూర్తి అయిన తర్వాత ఒక పెద్ద బేనర్లో తనకు ఆఫర్ వచ్చిందనీ అయితే ఆమూవీ దర్శక నిర్మాతలు తనకు టెస్ట్ ఘాట్ చేసిన తరువాత తాను హీరోగా పనికిరాను అంటూ తిరస్కరించడంతో అప్పట్లో తాను పడ్డ బాధ వివరించాడు.
తాను చిన్నప్పటి నుంచి చదువు విషయంలో పెద్దగా రాణించలేకపోవడంతో తాను అనేక అవమానాలు పడ్డానని దీనికితోడు తాను నటుడుగా కూడ పనికిరానా అంటూ విపరీతమైన బాధ పడ్డ విషయం తనకు ఇప్పటికీ గుర్తు అని అంటున్నాడు. అలాంటి పరిస్థితులలో తన మావయ్య చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహం అదేవిధంగా తన తండ్రి అరవింద్ ఇచ్చిన సపోర్ట్ తనను ఈస్థితికి తీసుకు వచ్చిన విషయాన్ని వివరించాడు.
తన తండ్రి అరవింద్ ధైర్యం చేసి తనతో ‘గంగోత్రి’ సినిమా తీసి హిట్ అయినప్పటికీ తాను హీరోగా పనికిరాను అంటూ అప్పట్లో రివ్యూలు వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. దీనితో భయపడిన తన తండ్రి తనతో మరొక సినిమా తీయడానికి కూడ భయపడిన విషయాన్ని పెట్టాడు. అలాంటి పరిస్థితులలో తనను నమ్మి సుకుమార్ ‘ఆర్య’ మూవీని తీసి తనను నిలబెట్టాడాని అంటూ ఇప్పుడు అదే సుకుమార్ తనకు ‘పుష్ప’ లో అవకాశం ఇచ్చి ఉత్తమ నటుడుగా మార్చడంతో ఈఅవార్డు వలన వచ్చే గౌరవం సుకుమార్ కే చెందుతుంది అంటూ బన్నీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..