నైజాం ఏరియాలో "భోళా శంకర్" మూవీకి ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇకపోతే ఈ మూవీ లో సుశాంత్ , కీర్తి సురేష్ కు లవర్ పాత్రలో నటించాడు. మహతి స్వర సాగర సంగీతం అందించిన ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు. ఈ మూవీ లో జబర్దస్త్ వేణు ,  హైపర్ ఆది , బిత్తిరి సత్తి , కమెడియన్ సత్య , లోబో కమెడియన్ లుగా నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే భోళా శంకర్ మూవీ కంటే ముందు చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


 దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. అందులో భాగంగా ఈ మూవీ.కి నైజాం ఏరియాలో కూడా దాదాపు 22 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిసినెస్ జరిగింది. ఇలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ లభించింది.


 దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లు దక్కలేదు. అలాగే నైజాం ఏరియాలో కూడా భారీ మొత్తంలో కలెక్షన్ లు దక్కలేదు. ఈ సినిమాకు నైజాం ఏరియాలో దాదాపు 7 కోట్ల మేర షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ కి నైజాం ఏరియాలో అటు ఇటుగా 15 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: