ఉత్తమ చిత్రంగా ఉప్పెన సినిమాని సెలెక్ట్ చేయడం కరెక్టేనా..?
ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్ సమయంలో థియేటర్లకు ఆడియన్స్ వస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధంగా ఉన్న సమయంలో ఉప్పెన సినిమా విడుదలై దాదాపుగా 100 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి.. ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమాకి కూడా ఊపిరి పోసింది ఈ చిత్రం. ఉప్పెన సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డులో కూడా సత్తా చాటింది. అందమైన ప్రేమ కథాంశ చిత్రంతో తెరకెక్కించిన ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం నేషనల్ అవార్డును సాధించింది. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా మెగా హీరో వైష్ణవ తేజ్ ,కృతి శెట్టి హీరోయిన్గా నటించారు.
తన తోలి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన వైష్ణవ తేజ్ ఈ సినిమాలో లవ్ ఎమోషన్ స్టార్స్ నెక్స్ట్ లెవెల్ లో మ్యూజిక్ అన్నీ కూడా బాగుండడంతో ఈ సినిమా హిట్ అయింది. అయితే 2021 అవార్డుల సినిమాలలో RRR, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నప్పటికీ ఉప్పెన సినిమాకే తెలుగులో నుంచి ప్రాంతీయ చిత్రంగా రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ సినిమా కంటే ఆ సినిమాలు చాలా కథ పరంగ ఎమోషనల్ పరంగా అన్ని బాగానే ఉన్నప్పటికీ తెలుగు ఉత్తమ చిత్రం ఎలా అయ్యిందో ఉప్పెన సినిమా అంటూ అర్థం కావడం లేదని పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.