ఖుషి నిడివి చుట్టూ సందేహాలు !
ఇలాంటి భారీ రన్ టైమ్ లవ్ రొమాంటిక్ ఎమోషనల్ సినిమాలకు ఎక్కువ అన్నకామెంట్స్ వస్తున్నాయి. కధలో చాల బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ అంతసేపు థియేటర్లలో కూర్చోవడానికి ఇబ్బంది పడే ఆస్కారం ఉంది అన్నకామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు సంబంధించి ధైర్యం చేసి ఇంత రన్ టైమ్ ఫిక్స్ చేశాడు అంటే అందులో ఏదో ఒక మాజిక్ ఉండే ఆస్కారం ఉంది అన్నమాటలు కూడ వినిపిస్తున్నాయి.
దేవుడిని నమ్మని ఒక నాస్తికుడి కొడుకు తెల్లారితే మొదలు దైవ ధ్యానం తప్ప మరో ప్రపంచం తెలియని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా ‘ఖుషి’ ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అబ్దుల్ వహాబ్ పాటల ట్యూన్స్ కు యూత్ ఇప్పటికే బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి. అయితే నిడివి విషయంలో దర్శకులు చేసే పొరపాట్ల వల్ల కొన్ని మంచి సినిమాలు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
నాని నటించిన ‘అంటే సుందరానికి’ ఆ సినిమా నిడివి ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. దీనితో నిడివి విషయంలో ‘ఖుషి’ మేకర్స్ ధైర్యం ఏమిటి అంటూ అప్పుడే ఇండస్ట్రివర్గాలలో చర్చలు మొదలైపోయాయి. సమంత అదేవిధంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. దీనితో ఈసినిమా పై ప్రేక్షకులు ఇచ్చే తుదితీర్పు ఎలా ఉంటుందో చూడాలి..