ఆ విషయంలో "వాల్టేర్ వీరయ్య" తో సమాన స్థాయిలో నిలిచిన "జైలర్"..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. అలాగే భారీ. కలెక్షన్ లను కూడా వసూలు చేశాయి. ఇకపోతే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అదిరిపోయి రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.


ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ తర్వాత ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో బేబీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వరుసగా 12 రోజుల పాటు ఒక కోటి షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్ట లేక పోయింది. ఇకపోతే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ "జైలర్" మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.


ఈ తమిళ డబ్బింగ్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ వాల్తేరు వీరయ్య ... బేబీ మూవీ లతో సరి సమానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.  ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: