బెదురులంక 2012 మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
ఈ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ అందించారు. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు సైతం ట్విట్టర్లో తమ రివ్యూలను తెలియజేయడం జరిగింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అనిపించిందా లేదా అనే విషయం తెలియాలి అంటే ట్విట్టర్ చూడాల్సిందే.. బెదురులంక గ్రామానికి చెందిన శివ (కార్తికేయ) ఒక స్వేచ్ఛ జీవిగా ఉంటారు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ దానిని మానేసి మరి బెదురులంకకు వస్తారు అక్కడ యుగాంతం రాబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తుంటాయి.. అయితే ఆ ఊరిలోనే జనాలను మోసం చేస్తూ కొంత మంది దొంగ జాతకాలు చెబుతూ యుగాంతరం రాబోతోంది అంటూ ఊరి ప్రజలను నమ్మిస్తూ ఉంటారు.
యుగాంతరం ఆపాలి అంటే అందరూ ఇళ్లలోనే ఉండే బంగారాన్ని ఇవ్వాలని దీంతో శివలింగానికి పూజలు చేసి యుగాంతరం ఆగిపోతుందని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత శివ ఏం చేశారు యుగాంతరం విషయంలో వారు చెప్పింది నిజమా అబద్దమా అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.. హీరోయిన్ నేహా శెట్టి తో ప్రేమలో పడడం జరుగుతుంది. ఈ సినిమా కామెడీ సన్నివేశాలు యాక్షన్ సన్నివేశాలు నేహా శెట్టి గ్లామర్ అందరిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉందని కామెడీ సినిమా అని తెలియజేస్తున్నారు ప్రేక్షకులు.. ఈ సినిమాతో కచ్చితంగా కార్తికేయ సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.