కింగ్ ఆఫ్ కొత్త రివ్యూ: దుల్కర్ మాస్ మూవీ ఎలా ఉంది?

Purushottham Vinay
వరుస సినిమాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మిస్తూ నటించిన సినిమా “కింగ్ ఆఫ్ కొత్త” ఈరోజు గ్రాండ్ గా విడుదల అయ్యింది. సో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక నటుడిగా ఇప్పటికే పలుమార్లు తన సత్తాను ఘనంగా చాటుకున్న దుల్కర్ సల్మాన్ కు ఈ సినిమాలో రాజు పాత్ర పోషించడం అంత కష్టమేమీ కాదు.ముఖ్యంగా కురూప్ లాంటి సినిమా తర్వాత ఇంచుమించుగా అదే తరహాలో ఉన్న పాత్రలో దుల్కర్ బాగా యాక్ట్ చేసి జీవించేశాడు. ముఖ్యంగా 40 ఏళ్ల వ్యక్తి పాత్రలో దుల్కర్ బాడీ లాంగ్వేజ్ బాగా ఆకట్టుకుంటుంది.ఇక డాన్ తరహాలో అతడి హావభావాలు ఇంకా మ్యానరిజమ్స్ అలరిస్తాయి. దుల్కర్ సల్మాన్ తర్వాత ఆస్థాయిలో ఆకట్టుకున్న నటుడు “సార్పట్ట” సినిమాలో డ్యాన్సింగ్ రోజ్ గా విశేషమైన రీతిలో అలరించిన షబ్బీర్.ఈ మూవీలో అతడికి మంచి పాత్ర లభించింది.



ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు.దుల్కర్ నటన, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ వర్క్, జేక్స్ బిజోయ్ బీజీయమ్, ఆర్ట్ వర్క్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ.. పాత్రలను పరిచయం చేసి తరువాత వాటిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం ఇంకా ట్విస్టులు పెద్దగా వర్కవుటవ్వకపోవడంతో ఈ మూవీ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇలాంటి ప్రెడిక్టబుల్ సినిమాతో, ముఖ్యంగా 4 నిమిషాల తక్కువ 3 గంటల నిడివితో జనాలని ఆకట్టుకోవడం చాలా కష్టమే.మొత్తానికి ఇదొక యావరేజ్ సినిమా. సీతారామం సినిమాతో ఎంతగానో మెప్పించిన దుల్కర్ ఈ సినిమాతో తన మాస్ యాంగిల్ ని చూపించి ఆకట్టుకున్నాడు కానీ సినిమా రొటీన్ గా ఉండటం ఈ తరహా మూవీస్ చాలా ఉండటం మాత్రం మైనస్ గా మారింది. మరి ఈ సినిమాకి వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: