"స్కంద" నైజాం... సీడెడ్ థియేటర్ హక్కులకు ఏకంగా అన్ని కోట్లు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న బోయపాటి శ్రీను ఆఖరుగా అఖండ మూవీ కి దర్శకత్వం వహించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే అఖండ లాంటి పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నైజాం , సీడెడ్ హక్కులను భారీ ధరలకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నైజాం హక్కులను 16 కోట్లకు , సీడెడ్ హక్కులను 9.10 కోట్ల ఈ మూవీ మేకర్స్ అమ్మేసినట్లు తెలుస్తోంది.


ఇకపోతే ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. రామ్ , బోయపాటి కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. మరి ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే వీరిద్దరికీ పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: