మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా చిరంజీవి "భోళా శంకర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
మహతీ స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించాడు. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొన్న ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ 30 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే చిరంజీవి తన తదుపరి రెండు మూవీ లను ఇప్పటికే ఓకే చేసుకున్నాడు. చిరంజీవి తదుపరి రెండు మూవీ లకు కళ్యాణి కృష్ణ , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి.