సిసింద్రీ కాకుండా.. అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రెండో సినిమా తెలుసా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బడా ఫ్యామిలీలలో ఒకటిగా కొనసాగుతూ ఉంది అక్కినేని ఫ్యామిలీ. అప్పట్లో నాగేశ్వరరావు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ప్రస్తానాన్ని కొనసాగించారు. ఇక ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన  నాగార్జున కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ మన్మధుడిగా  గుర్తింపును ఇప్పటికీ హవా నడిపిస్తూ ఉన్నారు. అయితే నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కూడా కాస్త కోస్తా నిలదొక్కుకున్నాడు. కానీ భారీ అంచనాలతో ఇండస్ట్రీకి వచ్చిన అఖిల్ మాత్రం ఇప్పటికి సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు.


 2015లో అఖిల్ అనే సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమాతోనే డిజాస్టర్ చవి చూశాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే ఇలా వరుస ఫ్లాప్ లతో  సతమతమవుతున్న సమయంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో మాత్రం అటు కాస్తో కోస్తూ చెప్పుకోదగ్గ హిట్ సాధించాడు అని చెప్పాలి. ఇక అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచిపోయింది. అయితే అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు అన్న విషయం తెలిసిందే. సిసింద్రీ సినిమాలో నటించాడు అన్న విషయం అందరికీ తెలుసు.


 1995లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున, టబు, ఆమని, శరత్ బాబు తదితరులు నటించారు. అయితే అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మరో సినిమాలో నటించాడు అనే విషయం చాలా మందికి తెలియదు. అవునా ఈ విషయం మాకు తెలియదే అనుకుంటున్నారు కదా. ఇంతకీ అఖిల్ నటించిన రెండో సినిమా ఏదో తెలుసా సంతోషం. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, శ్రీయ, గ్రేసి సింగ్  హీరో హీరోయిన్ లుగా నటించగా.. 2002లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాలో నాగార్జున కుమారుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ అక్షయ్ బచ్చు నటించిన  విషయం అందరికీ గుర్తుంటే ఉంటుంది. అయితే మొదట ఈ పాత్ర కోసం ఆ అఖిల్ ను తీసుకోవాలని అనుకున్నారట. ఇక కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ అఖిల్ కు ఫుల్ జ్వరం రావడంతో చేసేదేమీ లేక అకిల్ స్థానంలో అక్షయ్ బచ్చును తీసుకున్నారట డైరెక్టర్ దశరథ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: