వారి పక్కన నటించే ఛాన్స్ వదులుకున్న యంగ్ స్టార్ హీరో....!!
రజనీకాంత్ 179వ చిత్రాన్ని దర్శకుడు టీజే జ్ఞానవేలు తెరకెక్కించనున్నాడు.ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.. ఈ చిత్రంలో నటి మంజు వారియర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. అదే సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం నటుడు నానిని దర్శకుడు టీజే జ్ఞానవేలు కోరగా అయన ఆ ఆఫర్ ను వదులు కోవడంతో ఇది నాని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ సినిమాలో నాని పాత్ర కాస్త నెగెటివ్ షేడ్‌లో ఉంటుందట. దీనితో నాని ఆ పాత్రను తిరస్కరించినట్లు తెలుస్తోంది. నాని మొదటి సారి . 'వి' సినిమాలో నెగెటివ్ షేడ్ లో నటించిన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.దీనితో నెగిటివ్ పాత్రను మరో సారి చేయకూడదు అని నాని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనితో దర్శకుడు జ్ఞానవేలు ఆ పాత్రకు నటుడు శర్వానందను ఎంపిక చేసుకున్నాడని సమాచారం.