తెలుగు
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న
యువ నటుడు
సుహాస్ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన
యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలను దక్కించుకుంటూ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు . ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించాడు .
ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడం అలాగే ఈ
మూవీ లో ఇతను తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ
మూవీ తర్వాత ఈ నటుడికి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల జోరు మరింతగా పెరిగింది.
అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా హిట్ ది సెకండ్ కేస్ అనే
మూవీ లో విలన్ పాత్రలో కూడా నటించాడు . ఇకపోతే ప్రస్తుతం ఈ
యువ నటుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .
ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ రోజు
సుహాస్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా నుండి ఒక
పోస్టర్ ని విడుదల చేస్తూ ఈ
మూవీ టీజర్ ను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ
మూవీ బృందం తాజాగా విడుదల చేసిన
పోస్టర్ లో
సుహాస్ లుంగీ పంచ కట్టుకొని ... బనీన్ వేసుకొని ... మెడలో ఒక కండువా ను వేసుకొని ఒక స్టైలిష్ డ్యాన్స్ స్టెప్ ని వేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ
పోస్టర్ వైరల్ అవుతుంది.