ఇప్పటికే మహానటి ... సీత రామం అనే రెండు విజయవంతమైన తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కొత్త అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య లక్ష్మి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఆగస్టు 24 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు విడుదల చేయబోతుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను ఏ ఏరియాలో ఏ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయబోతున్నారు అని లిస్ట్ ను విడుదల చేసింది. ఆ వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ ని నైజాం ఏరియాలో ఇంద్ర ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ వారు విడుదల చేయనుండగా ... వైజాగ్ ఏరియాలో శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ వారు ... ఈస్ట్ లో వింటేజ్ క్రియేషన్స్ వారు ... వెస్ట్ లో ఆదిత్య ఫిలిమ్స్ వారు ... కృష్ణ లో అన్నపూర్ణ స్టూడియోస్ వారు ... గుంటూరు లో పద్మాకర్ సినిమాస్ వారు ... నెల్లూరు లో N సినిమాస్ వారు విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూవీ కి కనక మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.