నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. షాకింగ్ విషయం చెప్పిన రెజీనా?

praveen
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయంపై ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం నిజంగానే క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్నదానికి కొన్ని ఆధారాలు కూడా బయట పడుతూ ఉన్నాయి. ఒకప్పుడు కెరియర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోయిన్లు సైతం.. ఆ తర్వాత స్టార్లుగా ఎదిగాక... ఈ విషయాల గురించి బయట ఎక్కడ ప్రస్తావించేవారు కాదు. ఒకవేళ ఎక్కడ చెబితే తమ కెరియర్ పాడవుతుందో అని భయపడిపోయేవారు.


 కానీ ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దీంతో ఇక ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను నిర్మొహమాటంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉన్నారు. కొంతమంది దర్శకులు ఏకంగా అవకాశాల కోసం పక్కలోకి రమ్మన్నారు అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేయడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. అవకాశం ఇవ్వాలంటే ఒక దర్శకుడు కమిట్మెంట్ ఇవ్వాలి అని అడిగాడు అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పింది.



 ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తాను కూడా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యాను అంటూ చెప్పుకోచ్చింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన తొలినాళ్లల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అడ్జస్ట్మెంట్ కి ఓకే అంటే ఛాన్స్ ఇస్తాను. రేపటి నుంచి షూటింగ్ మొదలు పెట్టవచ్చు అని చెప్పాడు. అప్పుడు అడ్జస్ట్మెంట్ అంటే తనకు తెలియదని.. తన మేనేజర్ క్లారిటీ ఇస్తే గాని అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఎప్పుడు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు అంటూ రెజీనా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: