అల్లుఅర్జున్ జాతకం గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి....!!
ఇక ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారికి తగ్గ పరిహార పూజలు చేయించి ఇండస్ట్రీ లో వారికి మెరుగైన అవకాశాలు రావడానికి వేణు స్వామి పూజలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కంటే ఎక్కువ పేరు సంపాదించారు. అలాంటి వేణు స్వామి కేవలం స్టార్ హీరో హీరోయిన్ లకు పూజలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యలు ఇస్తూ కొంతమంది నటీనటుల గురించి సంచలన విషయాలు బయటపెడుతున్నారు.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు యాంకర్ అల్లు అర్జున్ జాతకం భవిష్యత్తు లో ఎలా ఉండబోతుంది అని అడగగా.. అల్లు అర్జున్ జాతకం చాలా బాగుందని,ఈయనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని, ఈయనపై ఏ నిర్మాత అయిన ₹10 పెట్టుబడి పెడితే 100 రూపాయల ఆదాయం వస్తుంది అని, అలాంటి గొప్ప జాతకం అల్లు అర్జున్ కి ఉంది అని,
అలాగే మరో 10 సంవత్సరాలపాటు అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతారని, అసలైన పాన్ ఇండియా స్టార్ అంటే కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు వేణు స్వామి. ప్రస్తుతం వేణు స్వామి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు అందరూ సంబరపడుతున్నారు.