మైత్రి సంస్థలో సమంత చేసిన మూవీలన్నీ బ్లాక్ బస్టర్... కుషి ఆ లిస్టులో చేరుతుంది... నవీన్ యేర్నేని..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ సంస్థ ఒకటి . ఇందులో నవీన్ యేర్నేని ఒక భాగస్వామి. ఇక పోతే ప్రస్తుతం వీరు ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ని నిర్మించారు. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. శివ నర్వణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు వశిం అబ్దుల్ వహీద్ సంగీతం అందించాడు . ఈ మూవీ ని అక్టోబర్ 1 వ తేదీని భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ బృందం భారీ ఎత్తున మ్యూజిక్ కాన్సెంట్ అనే ఈవెంట్ ను నిర్వహించింది. ఇకపోతే ఈ ఈవెంట్ లో ఈ సినిమా సంగీత దర్శకుడు మరియు కొంత మంది ప్రముఖ సింగర్ లు లైవ్ లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించగా ... విజయ్ ... సమంత లైవ్ లో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు .


ఇకపోతే ఈ ఈవెంట్ లో భాగంగా మైత్రి మూవీ సంస్థలో భాగస్వామి అయినటువంటి నవీన్ యేర్నేని మాట్లాడుతూ ... ఇప్పటివరకు సమంత మైత్రి మూవీ సంస్థలో జనతా గ్యారేజ్ ... రంగస్థలం ... పుష్ప సినిమాలలో నటించింది. ఈ మూడు మూవీ లు కూడా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా సమంత మా బ్యానర్ లో ఖుషి మూవీ లో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఆ మూవీ ల లిస్ట్ లో చేరిపోతుంది అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: