సామ్ - చై లాగే.. మరో సెలబ్రిటీ జోడి విడాకులు.. షాకింగ్ విషయం చెప్పిన వేణు స్వామి?
కొంతమంది స్టార్ హీరోయిన్లు అయితే ఏకంగా ఆయనను పిలిపించుకొని మరి పూజలు చేయించుకుంటున్నారు అంటే ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్పిన వేణు స్వామి ఇంకా ఎంతో మంది జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే చెప్పేస్తూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తూ ఉన్నారు. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారని చెప్పిన ఈయన.. రకుల్ ప్రీత్, రష్మిక, అనుష్క, అఖిల్, శ్రీ లీల ఇలా ఎంతో మంది హీరోయిన్ల భవిష్యత్తులను చెప్పారు. ఇందులో చాలా నిజమయ్యాయి కూడా.
అయితే ఇప్పుడు మరో సెలబ్రిటీ జోడీ జాతకం చెప్పగా.. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. నాగచైతన్య, సమంత లాగానే ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో సెలబ్రిటీ జోడి విడిపోతుంది అంటూ వేణు స్వామి చెప్పారు. ఆ సెలబ్రిటీ జోడి ఎవరో కాదు ఆది పినిశెట్టి, నిక్కి గల్రని. వీరి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. వీరు కలిసి ఉండటం అసాధ్యం. 80% విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటూ వేణు స్వామి బాంబు పేల్చారు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. వేణు స్వామి చెప్పినట్లు ఎంతో మంది విషయంలో జరిగింది. ఇక ఇప్పుడు నిక్కీ గల్రని, ఆది పినిశెట్టి విషయంలో కూడా నిజంగానే జరుగుతుందా అని అభిమానులు ఆందోళనలో మునిగిపోతున్నారు.