ప్రముఖ
తమిళ నటుడు
విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బిచ్చగాడు
మూవీ తో తెలుగు లో మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి వరుసగా ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఇప్పటికే ఈయన రెండు
మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒకటి బిచ్చగాడు ... రెండవది హత్య. బిచ్చగాడు 2
మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని అందుకోగా
హత్య సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ మంచి విజయాన్ని అందుకో లేక పోయింది. ఇకపోతే బిచ్చగాడు
మూవీ కి ఈయనే స్వీయ దర్శకత్వం వహించాడు.
ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు రోమియో అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన టైటిల్
పోస్టర్ ను ఈ
మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాను పాన్
ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి
మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే వినాయక్ వైద్యనాథన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ మేకర్స్ తాజాగా ఈ
మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ విడుదల చేసిన
పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ
మూవీ తో
విజయ్ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే.