ఏంటి.. పుష్ప తగ్గేదేలే డైలాగ్.. బూతు పదం నుంచి పుట్టిందా?

praveen
ఒకప్పుడు సినిమా డైరెక్టర్లందరూ ఒక సినిమా తీస్తున్న సమయంలో ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని మాత్రమే చూసేవారు. కానీ ఇటీవల కాలంలో ప్రేక్షకులకు నచ్చడమే కాదు సినిమాలో హీరోలు చెప్పే డైలాగులు సోషల్ మీడియాలో పాపులర్ అవుతాయా లేదా అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హీరోలకు ప్రత్యేకమైన మేనరిజం పెట్టడం లేదంటే పంచ్ డైలాగ్లను చెప్పించడం లాంటిది చేస్తూ ఉన్నారు. ఇక ఇలా డైరెక్టర్లు స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్న పంచ్ డైలాగులు, మేనరిజాలు కూడా బాగా పాపులర్ అవుతున్నాయ్.


 ఇలా ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపించిన పంచ్ డైలాగ్ పుష్ప సినిమాలోది. పుష్ప.. పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ యూత్ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరిని ఆకర్షించింది. ఇప్పటికీ అందరి నోటా ఈ డైలాగు నానుతూనే ఉంది. డైలాగ్ విషయంలో సుకుమార్ వేసుకున్న ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అయితే అసలు ఈ డైలాగ్ రాయడం వెనుక కారణం ఏంటి అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని రియలిస్టిక్ స్టోరీ నీ చూపించాలి అనుకున్నాడు సుకుమార్.


 స్టోరీ రాయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇక ఎన్నో ప్రాంతాలకు వెళ్లడం కూడా చేశాడు సుకుమార్. ఈ క్రమంలోనే ఒకసారి చిత్తూరుకు వెళ్లాడట. అక్కడ అరుగుపై కూర్చొని కథ రాసుకుంటున్న సమయంలో ఒక పెద్ద గొడవ జరిగిందట. సాధారణంగా గొడవ పడుతున్నప్పుడు బూతులు తిట్టుకోవడం కామన్. అయితే ఇలా అక్కడ గొడవ పడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బూతులు తిట్టుకుంటున్నారట. ఈ క్రమంలోనే నీ అవ్వ నేను తగ్గను నువ్వే మూసుకొని పో అంటూ తిట్టుకున్నారట. ఇక ఇదే డైలాగ్ కొన్నిసార్లు రిపీట్ కావడంతో ఇక ఆ డైలాగ్ సుకుమార్ మైండ్ లో ఫిక్స్ అయ్యింది. ఇక ఇలా దానికి కొంచెం మెరుగులా దిద్ది..ఇక పుష్పరాజ్ పేరుకు ముందు యాడ్ చేసేసాడు. ఇలా పుష్ప సినిమాలో బాగా పాపులర్ అయిన పంచ్ డైలాగ్ చివరికి బూతుల  నుంచి పుట్టింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: