నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ... బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ మూవీ కి టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం కూడా ఈ సినిమా యొక్క థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం హక్కులను అమ్మ వేసినట్లు సమాచారం. ఈ మూవీ యొక్క నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ తర్వాత బాలయ్య ... బేబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో నటించబోతున్నాడు.