చందు ముద్దు దర్శకత్వంలో అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చైతన్య రావు , లావణ్య , ఉత్తర రెడ్డి ప్రధాన పాత్రలలో నటించగా ... ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా చాలా తక్కువ సంఖ్యలో థియేటర్ లలో విడుదల కావడం ... ఈ మూవీ బృందం కూడా పెద్దగా పబ్లిసిటీ చేయకపోవడంతో ఈ మూవీ కి ఓపెనింగ్స్ చాలా తక్కువగా లభించాయి. కాకపోతే ఆ తర్వాత ఈ మూవీ కి పర్వాలేదు అనే టాక్ ప్రేక్షకుల నుండి రావడంతో ఈ మూవీ.కి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పరవాలేదు అనే రీతిలో అలరించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇకపోతే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఈటీవీ విన్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ ఈ సినిమాను ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.