మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇకపోతే ఈ మూవీ లో కీర్తి సురేష్ కు లవర్ పాత్రలో యంగ్ నటుడు సుశాంత్ నటించాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మహతీ స్వర సాగర్ సంగీతం అందించగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
వెన్నెల కిషోర్ , జబర్దస్త్ వేణు , సత్య , హైపర్ ఆది , బిత్తిరి సత్తి , లోబో ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ఈ నెల 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ మొత్తంలో కలెక్షన్ లు లభించడం లేదు. ఇకపోతే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమాను హిందీ లో కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
భోళా శంకర్ మూవీ హిందీ వర్షన్ ను ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. మరి ఈ మూవీ హిందీ వర్షన్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే భోళా శంకర్ హిందీ వర్షన్ కి చిరంజీవి కి జాకీ శ్రాఫ్ డబ్బింగ్ ని అందించాడు. ఇకపోతే ఈ మూవీ హిందీ వర్షన్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.