"7/g బృందావన కాలనీ" మూవీ వరల్డ్ వైడ్ రీ రిలీజ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
రవి కృష్ణ ... సోనియా అగర్వాల్ జంటగా కొన్ని సంవత్సరాల క్రితం బృందావన కాలనీ అనే లవ్ ప్లేస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. 2004 వ సంవత్సరం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని భారీ కలక్షన్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే మొదట ఈ మూవీ తమిళ్ లో విడుదల అయ్యింది. ఆ తర్వాత కొంత కాలానికి తెలుగు లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీ లలో కూడా మంచి విజయాన్ని అందుకుంది.  సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఇకపోతే 2004 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ రిలీజ్ కు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
 


ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన రీ రిలీజ్ తేదీని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను "ఏయూ సినిమా" సంస్థ దక్కించుకుంది. అలాగే ఈ సంస్థ ఈ మూవీ 4 కే వర్షన్  రీ రిలీజ్ తేదీని కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: